: ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా... అయితే డేంజరే!


అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఎలక్ట్రానిక్ వస్తువులు మనకు ఎంతో సౌలభ్యంగా ఉంటాయి. కానీ, కొన్ని మాత్రం అంతే ప్రమాదకరంగా కూడా ఉంటాయి. ఇప్పుడు మొబైల్ మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ల హవా కొనసాగుతోంది. మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అవును అంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఆ రకం ఫోన్లకు ‘డెండ్రాయిడ్’ అనే కొత్త వైరస్ భారత్ లో శరవేగంగా వ్యాపిస్తోందట. ట్రోజన్ రకానికి చెందిన ఈ వైరస్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్ ను వేరే వ్యక్తి పరోక్షంగా పూర్తిగా నియంత్రించే అవకాశముందని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా (సెర్ట్-ఇన్) నిపుణులు హెచ్చరిస్తున్నారు.

‘డెండ్రాయిడ్’ వైరస్ కనుక ఆండ్రాయిడ్ లో ఒక్కసారి యాక్టివేట్ అయితే ఇక అంతే! ఆ స్మార్ట్ ఫోన్ లోని కమాండ్ ను మార్చడం, కాల్ లాగ్స్ డిటెక్ట్ చేయడం, వెబ్ పేజీలను తెరవడం, ఏ నెంబరుకైనా డయల్ చేయడం, ఫోన్ కాల్స్ ను రికార్డు చేయడం, ఫోటోలు, వీడియోలను ఫోన్ నుంచి అప్ లోడ్ చేయడం వంటివన్నీ చేస్తుంది. అంతేకాదు, మనకొచ్చే సంక్షిప్త సందేశాలను (ఎస్ఎంఎస్) నిలువరిస్తుంది. ఈ వైరస్ నుంచి మీ స్మార్ట్ ఫోన్ ను కాపాడుకోవటమెలా అని తల పట్టుకుంటున్నారా? ఈ వైరస్ నుంచి తప్పించుకొనేందుకు నిపుణులు ఈ ఆరు జాగ్రత్తలను సూచిస్తున్నారు.

* అనధికార వెబ్ సైట్ల నుంచి అప్లికేషన్లను డౌన్ లోడ్ చేయకూడదు.
* యాంటీ వైరస్ ను ఎప్పటికప్పడు అప్ డేట్ చేసుకోవాలి
* ఎస్.డి. మెమరీ కార్డులను ఎన్ క్రిప్ట్ చేసుకోవాలి
* ఫోన్ వాడకాన్ని నిశితంగా పరిశీలిస్తుండాలి.. ఫోన్ బిల్లు అనూహ్యంగా పెరిగితే ఐటమైజ్డ్ బిల్లును తీసుకుని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి.
* డేటా యూసేజ్, బ్యాటరీ పనితీరు మీదా ఓ కన్నేయాలి.
* బహిరంగ ప్రదేశాల్లో ఉచితంగా దొరికింది కదా అని ఏ వై-ఫై నెట్ వర్క్ ను వినియోగించకూడదు.

  • Loading...

More Telugu News