: ఐపీఎల్ తాజా సీజన్ ను రద్దుచేయండి: లలిత్ మోడీ
క్రికెట్ క్రీడ శ్రేయస్సు దృష్ట్యా ఐపీఎల్-7ను రద్దు చేయాలని లలిత్ మోడీ డిమాండ్ చేశారు. గతంలో ఐపీఎల్ చైర్మన్ గా వ్యవహరించిన లలిత్ మోడీ మీడియాతో మాట్లాడుతూ, లీగ్ లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడం ద్వారా బీసీసీఐ క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. లీగ్ తాజా సీజన్ ను రద్దు చేసి సీబీఐ విచారణ జరిపించాలన్న ఐపీఎల్ మాజీ చైర్మన్ శశాంక్ మనోహర్ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్టు మోడీ చెప్పారు.
'స్పాట్ ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ క్రికెట్ ప్రతిష్ఠను మసకబారేలా చేశాయి. ఫ్యాన్స్ క్రమేణా ఈ క్రీడ విలువలపై విశ్వాసం కోల్పోతున్నారు. ప్రజల్లోకి సరైన సందేశం పంపాలంటే 2014 ఐపీఎల్ సీజన్ ను రద్దు చేయడమొక్కటే మార్గం' అని మోడీ పేర్కొన్నారు.