: ఈ సారి ఎన్నికల ఖర్చు 5వేల కోట్లు: ఈసీ
వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం దేశంలో రూ.5వేల కోట్ల ఖర్చు అవనుందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ప్రతి నియోజకవర్గానికి సగటున రూ.10 కోట్ల వరకు ఖర్చు కానుందని కమిషన్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింల నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం రూ.వెయ్యి కోట్ల వరకు ఖర్చవుతుందని ఎన్నికల కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మ చెప్పారు. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో ప్రతి అభ్యర్థి తన నియోజకవర్గంలో చేసే వ్యయ పరిమితిని పెద్ద రాష్ట్రాల్లో రూ.40 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు పెంచినట్లు, చిన్న రాష్ట్రాల్లో ఈ ఖర్చు పరిమితి రూ.54 లక్షలు అని తెలిపారు.