: తడాఖా చూపిన సెహ్వాగ్
దాదాపు తెరమరుగుయ్యే స్థితిలో నిల్చిన డాషింగ్ బ్యాట్స్ మన్ వీరేంద్ర సెహ్వాగ్ జూలు విదిల్చాడు. డర్హం జట్టుతో అబుదాబిలో జరుగుతున్న కౌంటీ టెస్టు మ్యాచ్ లో ఎంసీసీకి సారథ్యం వహించిన సెహ్వాగ్ వీరోచిత సెంచరీతో జట్టుకు విజయాన్నందించాడు. సెహ్వాగ్ రెండో ఇన్నింగ్స్ లో 97 బంతుల్లోనే 107 పరుగులు చేయడంతో ఎంసీసీ జట్టు 225 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఈ ఢిల్లీ స్టార్ స్కోరులో 18 బౌండరీలుండడం విశేషం. సమిత్ పటేల్ (48 నాటౌట్) తో నాలుగో వికెట్ కు సెహ్వాగ్ 105 పరుగులు జోడించాడు.
కాగా, ఈ మ్యాచ్ లో డర్హం జట్టు తొలి ఇన్నింగ్స్ లో 248 పరుగులు చేయగా, ఎంసీసీ 282 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో 257 పరుగులు చేసిన డర్హం... ఎంసీసీ జట్టుకు 225 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.