: నేడు అభిమానులతో దీపికా లైవ్ చాట్
అందాల భామ దీపికా పదుకొనె ఈ రోజు తన 15 మిలియన్ల మంది ఫేస్ బుక్ అభిమానులతో లైవ్ వెబ్ చాట్ చేయనుంది. దీని ద్వారా వారికి తన మద్దతు, ప్రేమను తెలపనుంది. తోటి స్టార్లలా ఎఫ్ బీ లో కూడా తనను ఇంతమంది (15 మిలియన్స్) అభిమానులు ఇష్టపడుతున్నందుకు కృతజ్ఞతలు తెలపనుంది. లైవ్ చాట్ కోసం దీపిక తన ఫోటో ఒకటి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె 'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రం షూటింగ్ తో బిజీగా ఉంది.