: ప్రారంభమైన రాంచరణ్ పుట్టినరోజు వేడుకలు
హైదరాబాదులో హీరో రాంచరణ్ బర్త్ డే వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ లో ఉన్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. బ్లడ్ డొనేట్ చేయడానికి దాదాపు 500 మంది అభిమానులు రక్తదాన శిబిరం చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి చరణ్ కూడా హాజరయ్యారు. ఫిలింనగర్ క్లబ్ లో అభిమానులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.