: వారణాసిలో పేలుళ్లకు కుట్ర... ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్


ఉగ్రవాదుల విధ్వంస ప్రణాళికలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కరుడుగట్టిన ఇండియన్ ముజాహిదీన్ సంస్థ చీఫ్ సహా ఐదుగురు ఉగ్రవాదులు, వారికి సంబంధించి మరో నలుగురు అనుచరులను అరెస్ట్ చేసిన రోజుల వ్యవధిలోనే, తాజాగా ఉత్తర ప్రదేశ్ లో ఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడ్డారు. పవిత్ర పుణ్యక్షేత్రం కాశీలో ఎన్నికల సందర్భంగా బాంబుపేలుళ్ల ద్వారా రక్తం పారించడానికి వీరు ప్రణాళిక వేశారు. ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) పోలీసులు ఈ ఉదయం గోరఖ్ పూర్ లో ఇద్దరు పాకిస్థానీ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వారు గోరక్ పూర్ నుంచి అయోధ్యకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారని తెలిసింది.

వారణాసిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పోటీచేయనున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల సందర్భంగా వారణాసిలో పేలుళ్లకు పథకం వేసినట్లు పట్టుబడ్డ ఉగ్రవాదులు వెల్లడించారని ఏటీఎస్ పోలీసులు తెలిపారు. ఇద్దరు ఉగ్రవాదులను ఈ రోజు కోర్టులో హాజరుపరచనున్నారు.

  • Loading...

More Telugu News