: కాసేపట్లో బీజేపీలో చేరనున్న ప్రముఖ హీరో!
ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో బీజేపీలోకి చేరికలు ఎక్కువవుతున్నాయి. రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం తప్పదని సర్వేలన్నీ చెబుతున్న వేళ... బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి ప్రముఖులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే సినీనటులు పవన్, నాగార్జున, సురేష్ తదితరులు బీజేపీ గూటికి చేరిపోయారు. ఈ క్రమంలో మరో ప్రముఖ హీరో కాసేపట్లో బీజేపీలోకి చేరబోతున్నారు.
కాషాయ కండువా కప్పుకోనున్న ఈ సినీనటుడు మోహన్ బాబే అని విశ్వసనీయ సమాచారం. రెండు, మూడు రోజుల్లో సంచలన ప్రకటన చేస్తానని మొన్న తిరుపతిలో మోహన్ బాబు చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం కూడా బీజేపీలోకి చేరాలని ఉవ్విళ్లూరుతున్నట్టు సమాచారం. వీరితోపాటు, మరో హీరో శివాజీ కూడా బీజేపీలోకి చేరాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ, బీజేపీలోకి చేరనున్న ప్రముఖ హీరో ఎవరన్నది కాసేపట్లో అధికారికంగా తెలియనుంది.