: ఇది తెలుగుజాతికి పరీక్ష: బాబు


ప్రస్తుత ఎన్నికల సమయం తెలుగుజాతికి పరీక్ష అని చంద్రబాబు చెప్పారు. ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు వస్తే పసుపు జెండాలు చూపాలని, వారికి గుండెల్లో రైళ్ళు పరిగెత్తుతాయని చెప్పారు. ప్రజలకు వాస్తవాలు చెప్పడానికే ఈ ప్రజాగర్జన సభ అని చెప్పారు. పదవులపై తనకు వ్యామోహం లేదని స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో జరిగిన ప్రజాగర్జన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దీపం పథకాన్ని మళ్ళీ తెస్తానని బాబు హామీ ఇచ్చారు. తాను దీపం వెలిగిస్తే కాంగ్రెస్ దొంగలు ఆర్పేశారని మండిపడ్డారు. మనం బలంగా ఉంటేనే అందరూ గౌరవిస్తారని చెప్పారు. పుచ్చుల్లేని కూరగాయలు కొనేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈసారి కాంగ్రెస్ ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తనలో ఇప్పుడు మరింత కసి ఉందని బాబు చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News