: టీడీపీలో చేరిన శత్రుచర్ల
మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు నేడు టీడీపీలో చేరారు. శ్రీకాకుళంలో జరుగుతున్న ప్రజాగర్జన సభ సందర్బంగా ఆయన బాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ గొర్లె హరిబాబు నాయుడు, మాజీ ఎమ్మెల్యే దువ్వాడ నాగావళి కూడా పసుపు కండువాలు ధరించారు.