: టర్కీలో ట్విట్టర్ పై నిషేధం ఎత్తివేతకు కోర్టు ఆదేశం


టర్కీలో ట్విట్టర్ పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని రాజధాని అంకారాలోని అడ్మినిస్ట్రేటివ్ కోర్టు ఆదేశించింది. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన ఆడియో క్లిప్పింగ్స్ ట్విట్టర్లో వేగంగా పాకిపోవడంతో ప్రధాని రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఆ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ పై నిషేధం విధించారు. అంతేగాకుండా వేల సంఖ్యలో వెబ్ సైట్లపైనా నిషేధం విధించారు. దీనిపై అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

ఐక్యరాజ్యసమితి హై కమిషనర్ తో పాటు, పలు దేశాలు ట్విట్టర్ పై నిషేధాన్ని ఖండించాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన అడ్మినిస్ట్రేటివ్ కోర్టు ట్విట్టర్ పై నిషేధాన్ని ఎత్తివేయాలని టర్కీ టెలికమ్యూనికేషన్స్ అథారిటీని ఆదేశించింది.

  • Loading...

More Telugu News