: కేజ్రీవాల్ పై ఇంకు ఘటనను ఖండించిన దిగ్విజయ్


ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై నిన్న వారణాసిలో సిరా చల్లిన ఘటనపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ స్పందించారు. అలాంటి చర్యలు ఖండించాల్సిందేనని తెలిపారు. సిరా చల్లడం బీజేపీ పనే అయివుంటుందని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ ఓ ఫాసిస్టు (నియంతృత్వ) పార్టీ అని అభివర్ణిస్తూ, ఇలాంటి చర్యలకు పాల్పడేది వారేనని ఆరోపించారు. అయితే, తానేమీ కేజ్రీవాల్ పై అభిమానంతో సిరా ఘటనను ఖండించడంలేదని అన్నారు.

ఆయన (కేజ్రీవాల్) ఎలాంటి ఆధారాలు లేని సొల్లుకబుర్లు మాట్లాడతారని ఎద్దేవా చేశారు. ఇక, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై వ్యాఖ్యానిస్తూ, ఆయన ఎన్నటికీ ప్రధాని కాలేరని పేర్కొన్నారు. పిచ్చివాళ్ళెన్నడూ దేశాన్ని పరిపాలించలేరని తెలిపారు.

  • Loading...

More Telugu News