: కిరణ్, కేసీఆర్ లపై వీహెచ్ విసుర్లు


65ఏళ్లు నిండిన ప్రొఫెసర్ల సేవలను వినియోగించుకోవాలని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు గవర్నర్ నరసింహన్ ను కోరారు. ప్రొఫెసర్ల సేవలను వినియోగించుకోవాలన్న నిబంధనను మాజీ ముఖ్యమంత్రి కిరణ్ తుంగలో తొక్కారని ఆరోపించారు. సీఎంగా ఉన్నప్పుడు కిరణ్ శాడిస్ట్ లా వ్యవహరించారని ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధించామని చాలా మంది చెప్పుకుంటున్నారని... కానీ, ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకే సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చిందని తెలిపారు. ఏ మాత్రం నీతి ఉన్నా కేసీఆర్ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News