: వడోదరలో మోడీ ప్రత్యర్థి మిస్త్రీ
గుజరాత్ లోని వడోదర లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీపై కాంగ్రెస్ పార్టీ మధుసూదన్ మిస్త్రీని బరిలోకి దింపింది. సరైన అభ్యర్థిని పోటీలో నిలపాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మిస్త్రీని వడోదర అభ్యర్థిగా ఎంపిక చేశారు. మిస్త్రీ అభ్యర్థిత్వాన్ని రాహుల్ గాంధీ ప్రకటించారు. అయితే, వారణాసిలో మోడీపై పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది ఇంకా వెల్లడించాల్సి ఉంది.