: కొత్త కొలువులు తెచ్చిన ఘనత మాదే : సీఎం
రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు సృష్టించిన ఘనత తమ ప్రభుత్వానిదే అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ (అప్పా)లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే 1.25 లక్షల ఉద్యోగాలిచ్చామని, మరో లక్షన్నర ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. గత 20 ఏళ్లకాలంలో ఇంత పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించిన సందర్భాలు ఏ ప్రభుత్వ హయాంలోనూ లేవన్నారు. అకాడమీలో ఈ రోజు జరిగిన 2012 బ్యాచ్ ఎస్సైల పాసింగ్ అవుట్ పేరేడ్ లో సీఎం ఉత్సాహంగా పాల్గొన్నారు.