: రహస్య ప్రదేశంలో తాలిబాన్లతో పాక్ చర్చలు


ఎట్టకేలకు పాకిస్తాన్ సర్కారు, తాలిబాన్ల మధ్య చర్చలు ఆరంభమయ్యాయి. ఉత్తర వజీరిస్తాన్ గిరిజన ప్రాంతంలోని ఓ రహస్య ప్రదేశంలో ఈ చర్చలు జరుగుతున్నాయి. చర్చల వేదిక వద్దకు చేరుకున్న అనంతరం పాక్ ప్రభుత్వ కమిటీ సభ్యులు అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి చౌదరీ నిసార్ అలీ ఖాన్ కు సమాచారమందించారు. ప్రభుత్వ విన్నపాన్ని మన్నించి తెహ్రీక్-ఏ-తాలిబాన్ సంస్థ నెల రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని పాక్ ప్రభుత్వం స్వాగతించింది. కాగా, చర్చల అనంతరం కాల్పుల విరమణను తాలిబాన్లు పొడిగిస్తారని పాక్ సర్కారు భావిస్తోంది.

  • Loading...

More Telugu News