: నల్లధనం వ్యవహారంలో కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేయకుండా ఉన్న కేంద్రప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో కేంద్రం పూర్తిగా విఫలమయిందని తీవ్రంగా వ్యాఖ్యానించింది. అరవై ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి చర్య తీసుకోలేకపోయిందని... సరైన చర్యలు తీసుకుని ఉంటే దేశ గతి మరోలా ఉండేదని ఘాటుగా స్పందించింది.