: సుప్రీం సూచనపై పెదవి విప్పని శ్రీనివాసన్


బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటేనే ఐపీఎల్ ఫిక్సింగ్ విచారణకు మార్గం సుగమం అవుతుందన్న సుప్రీం కోర్టు సూచనలపై ఎన్. శ్రీనివాసన్ పెదవి విప్పడంలేదు. ఆయన న్యాయవాది పీఎస్ రామన్ సైతం ఈ విషయంపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. ఇటీవల ఓ కంటి శుక్లానికి ఆపరేషన్ చేయించుకున్న శ్రీనివాసన్ నేడు మరో కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. లాయర్ రామన్ ఈ ఉదయం శ్రీనివాసన్ నివాసానికి వచ్చారు. వెలుపలికి వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, 'ఆయన (శ్రీనివాసన్) కంటి ఆపరేషన్ చేయించుకోవడంతో పరామర్శించడానికే వచ్చాను. ఇతరత్రా ఏమీ చర్చించలేదు' అని పేర్కొన్నారు. శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతారా? అన్న ప్రశ్నకు జవాబిచ్చేందుకు రామన్ నిరాకరించారు.

కాగా, ఫిక్సింగ్ వ్యవహారంపై రేపు సుప్రీంలో విచారణ జరగనుంది. ఆ విచారణ తర్వాతే పదవికి రాజీనామా విషయమై శ్రీనివాసన్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News