: అప్జల్ గురు ఉరిశిక్షలో అలా చేసి ఉంటే బావుండేది: షిండే
పార్లమెంటుపై 2001లో ముష్కరుల దాడి కేసులో దోషి అఫ్జల్ గురును ఉరితీసే వ్యవహారంలో ప్రభుత్వం ఇంకా మెరుగ్గా వ్యవహరించి ఉంటే బావుండేదని కేంద్ర హోంమంత్రి షిండే అన్నారు. గతేడాది ఫిబ్రవరిలో అఫ్జల్ గురును ఉరితీసిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం దోషిని ఉరితీసే విషయాన్ని ముందుగానే కుటుంబ సభ్యులకు తెలియజేయాలి. అయితే, ప్రభుత్వం పంపించిన లేఖ అఫ్జల్ ను ఉరి తీసిన రెండు రోజుల తర్వాత వారి కుటుంబ సభ్యులకు చేరింది. అంతకు ముందే ఉరి విషయం టీవీల ద్వారా వారికి తెలిసింది. దీనిపై షిండే మాట్లాడుతూ.. నాలుగు రోజుల ముందే అఫ్జల్ ఉరికి అనుమతిస్తూ ఫైల్ పై సంతకం చేశానని... అదే విషయం కుటుంబ సభ్యులకు తెలియజేయడం అధికారుల బాధ్యతని షిండే చెప్పారు. అఫ్జల్ కుటుంబ సభ్యులకు తెలియజేసే విషయంలో తప్పు జరిగిందని, ఆలస్యమైందని ఒప్పుకున్నారు.