: కప్పు టీ ఖరీదు 5000
నరేంద్ర మోడీ పుణ్యమా అని చాయ్ కి గిరాకీ పెరిగింది. మోడీ అభిమానులంతా ఛాయ్ వైపు మళ్లుతుంటే ఛాయ్ వాలాలు సంబరపడిపోతున్నారు. నమో చాయ్ దుకాణాలు నగరాల్లో దర్శనమిస్తుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నిధుల సమీకరణకు టీ పార్టీ ఏర్పాటు చేసింది. మార్చి 29న గుర్గావ్ లోని ఓ స్టార్ హోటల్ లో ఈ టీ పార్టీ నిర్వహించనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించే ఈ టీ పార్టీలో కప్పు టీ ధర కేవలం ఐదువేల రూపాయలే. ఈ కార్యక్రమానికి యోగేంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా వ్యవహరించనున్నారు. ఈ టీ పార్టీ ద్వారా సేకరించిన విరాళాల వివరాలు పార్టీ వెబ్ సైట్ లో పెడతామని, ఇందులో దాపరికం ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఇలా నిధులు సేకరించడం తప్పు కాదని ఆయన తెలిపారు.