: కూతురు ప్రియుడితో వెళ్ళిపోతే... ఆమె డిపాజిట్లు తండ్రివే: ఢిల్లీ కోర్టు


ఇదో విభిన్న తీర్పు. కుటుంబం, సామాజిక నిబంధనలను కాదని, ప్రియుడితో ఏ యువతి అయినా వెళ్ళిపోతే... ఆమె పేరిట బ్యాంకులో ఉన్న డిపాజిట్లు తండ్రికే దక్కుతాయని ఢిల్లీలోని ఒక స్థానిక కోర్టు తీర్పు చెప్పింది. ప్రియుడితో వెళ్లిపోయిన ఓ యువతి బ్యాంకులో తన పేరిట ఉన్న డిపాజిట్లు తండ్రి తీసుకోకుండా ఇంజక్షన్ ఉత్తర్వులను ఇవ్వాలని కోరగా.. దానికి వ్యతిరేకంగా ఆమె తండ్రి కూడా అదే కోర్టును ఆశ్రయించారు. కేసులో వాదనలు విన్న న్యాయమూర్తి ఎదుగుతున్న కూతురు తండ్రి మాటను కాదని వెళితే తన కష్టార్జితాన్ని ఇవ్వడానికి ఏ తండ్రయినా అంగీకరించడని వ్యాఖ్యానించారు.

మైనర్ ఖాతాల్లో తండ్రి లేదా సంరక్షకుడు నగదు డిపాజిట్లు చేసినా... మేజర్ అయ్యాక సొమ్మంతా ఖాతాదారులకే చెందుతుందని, మరెవరూ క్లెయిమ్ చేయలేరని బ్యాంకు కూడా కోర్టుకు తెలిపింది. తండ్రి డిపాజిట్ చేసినా అది గిఫ్ట్ కిందకు వస్తుందని, ఒకసారి ఇచ్చిన తర్వాత దాన్ని క్లెయిమ్ చేసుకోలేరని యువతి తరపు లాయర్ కూడా వాదించారు. అయితే, ఆ యువతి వాదనలతో కోర్టు ఏకీభవించలేదు.

  • Loading...

More Telugu News