: అనంతపురంలో బాంబు పేలుడు


అనంతపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ రోజు ఓ బాంబు పేలింది. అయితే బాంబు పేలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పాటు దుమ్ము లేవడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. ఘటన జరిగిన ప్రదేశంలో ప్రస్తుతం బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఈ బాంబు అక్కడ ఎవరు ఉంచారు? ఎందుకు ఉంచారు? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యర్థిని హతమార్చడానికి ఎవరైనా బాంబును అక్కడ ఉంచారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News