: పనిమంతులకు ఉపాధి కరవు... పట్టభద్రులకు ఉద్యోగం కరవు


దేశంలో నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. చదువుకున్న పట్టభద్రులకు ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం విఫలమౌతోంది. బీజేపీ పాలనలో ఉద్యోగాల కల్పన 2.66 శాతం ఉంటే... ఇప్పుడది 0.83 శాతానికి పడిపోయింది. దేశంలో పని చేసే వయస్సుకు చేరుతున్న వారు కోటిమంది ఉన్నారు. వీరిలో 51 శాతం మందికి తగిన నైపుణ్యాలు ఉండటం లేదు. ఇక, నైపుణ్యాలున్న పనిమంతులకు తగిన ఉద్యోగం దొరకడం లేదు.

ప్రతి ఏటా 15 లక్షల మంది ఇంజనీరింగ్ పూర్తి చేస్తుండగా, వారిలో 17 శాతం మందికే అర్హతలకు తగిన ఉద్యోగం లభిస్తోంది. అలాగే, ఎంబీఏ చదివిన వారిలో 10 శాతం మందికే ఉద్యోగాలు వస్తున్నాయి. యువశక్తిని ఒడిసిపట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమౌతున్నాయి. 10 లక్షల మందికి నైపుణ్యాభివృద్ధి కోసం వెయ్యి కోట్లు కేటాయింపులు జరిపారు. అయితే, కేవలం 18 వేల మందికి ప్రభుత్వం శిక్షణ ఇవ్వగలిగింది. చదువు పూర్తి చేసిన యువతీ యువకులకు తగిన శిక్షణనిచ్చి, ఉద్యోగాలను ఇవ్వగలిగితే భారత్ మరింత అభివృద్ధి సాధిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

  • Loading...

More Telugu News