: మోడీ సొంత ప్రభుత్వం కాదు: జైట్లీ


ఆమ్ ఆద్మీ తమకు టీవీల్లో మాత్రమే ప్రత్యర్థి అని.. బయట మాత్రం అసలైన ప్రత్యర్థి కాంగ్రెస్సేనని బీజేపీ నేత అరుణ్ జైట్లీ అన్నారు. పంజాబ్ లోని అమృత్ సర్ లోక్ సభ స్థానం నుంచి జైట్లీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ ప్రచారమంతా మోడీ చుట్టూనే తిరుగుతుందన్న విమర్శల నేపథ్యంలో జైట్లీ స్పందించారు. రాష్ట్రాల్లో ఒక వ్యక్తి (ముఖ్యమంత్రి) ఆధారంగా ప్రభుత్వాలు నడవడానికి అవకాశం ఉంటుందేమో కానీ, కేంద్రంలో మాత్రం పరిస్థితి వేరని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో మోడీకున్న ఆకర్షణను పూర్తిగా వినియోగించుకుంటామని చెప్పారు. అలాగే, ఎన్నికల అనంతరం ఏర్పడే ప్రభుత్వానికి మోడీ నాయకత్వం వహిస్తారని.... అది మోడీ వ్యక్తిగత ప్రభుత్వం కాదని, జాతీయ ప్రభుత్వమని వివరించారు.

  • Loading...

More Telugu News