: విమానాశ్రయంలో 105 కేజీల బంగారం స్వాధీనం


బంగ్లాదేశ్ చిట్టగాంగ్ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన బంగ్లాదేశ్ విమానంలో 105 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు కనుగొన్నారు. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. విమానంలోని సీట్ల కింద ప్లాస్టిక్ సంచులతో 902 బంగారం కడ్డీలు ఉన్నాయని అధికారులు తెలిపారు. విమాన ప్రయాణికుల్లో పదిమందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఏడుగురికి బంగారంతో సంబంధం ఉంది. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద మొత్తంలో బంగారం దొరకడం ఇదే తొలిసారి. గతేడాది జూలైలో ఢాకా విమానాశ్రయంలో ప్రయాణికుల లగేజీ నుంచి 124 కేజీల బంగారం దొరికింది.

  • Loading...

More Telugu News