: సుబ్రతారాయ్ ప్రతిపాదనపై నేడు సుప్రీం విచారణ
సహారా ఇండియా అధినేత సుబ్రతారాయ్ ప్రతిపాదనలపై సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. మదుపరులకు చెల్లించాల్సిన మొత్తాన్ని మూడు దశల్లో చెల్లిస్తామని, ఇంకా ఏవైనా చెల్లించాల్సినవి ఉంటే ఆ మొత్తానికి సెబీ దగ్గర డిపాజిట్ చేస్తామని, బ్యాంకు గ్యారంటీ కూడా సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని సుబ్రతారాయ్ తరపు న్యాయవాది రామ్ జెఠ్మలానీ న్యాయస్థానానికి తెలిపారు. సీఎ సుందరం మార్చి 4న జారీ చేసిన ఆదేశాలు చట్టబద్దమైనవి కావని ఆయన పేర్కొన్నారు. దీనిపై నేడు సుప్రీంకోర్టు విచారించనుంది.