: నేడు శ్రీకాకుళంలో టీడీపీ ప్రజాగర్జన సదస్సు
తెలుగుదేశం పార్టీ ప్రజాగర్జన సదస్సు ఈ రోజు శ్రీకాకుళం పట్టణంలోని 80 అడుగుల రోడ్డు ప్రాంతంలో జరగనుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ పార్టీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళం చేరుకుంటారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం పట్టణంలోని డే అండ్ నైట్, ఏడు రోడ్ల కూడలి, పాత బస్టాండ్ మీదుగా నిర్వహించే ర్యాలీలో పాల్గొంటారు. బహిరంగ సభ సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ప్రజాగర్జన సభను విజయవంతం చేసేందుకు పార్టీ వర్గాలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. మాజీ ఎమ్మెల్సీ గొర్లె హరిబాబు, టెక్కలి మాజీ ఎమ్మెల్యే దువ్వాడ నాగావళి, మాజీ ఎంపీపీ కృష్ణమూర్తి తదితరులు ఈ సందర్భంగా టీడీపీలో చేరనున్నారు.