: కాంగ్రెస్ మేనిఫెస్టో నేడే విడుదల
లోక్ సభ ఎన్నికల సమయంలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ నేడు తన మేనిఫెస్టో విడుదల చేయనుంది. మోడీ ప్రభంజనం దేశాన్ని ఊపేస్తున్న ప్రస్తుత తరుణంలో సంక్షేమ చర్యలు, హక్కుల పరిధి, విస్తరణ వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తయారు చేసినట్టు సమాచారం. ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సమక్షంలో ఏఐసీసీ అధినేత్రి సోనియా ఆ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.
దేశంలో వేళ్లూనుకున్న అవినీతి అంతానికి చేపట్టనున్న గట్టి సంస్కరణలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచారు. అవినీతిని అరికట్టడం, విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించడం, ధరల పెరుగుదలను నియంత్రించడం, బ్లాక్ మార్కెట్ ను లేకుండా చేయడం వంటి అంశాలు ఇందులో చోటు చేసుకోనున్నాయి.