: బీసీ వ్యక్తి సీఎం కావాలంటే యుద్ధాలు చేయనక్కర్లేదు: ఆర్.కృష్ణయ్య
మహబూబ్ నగర్లో జరిగిన టీడీపీ ప్రజాగర్జన సభలో బీసీ నేత ఆర్. కృష్ణయ్య ఉద్వేగంతో ప్రసంగించారు. బీసీ వ్యక్తి సీఎం కావాలంటే యుద్ధాలు, పోరాటాలు చేయనక్కర్లేదని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే చాలని చెప్పారు. పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో పాలమూరు జిల్లా ఆగమాగమైందని ఆయన మండిపడ్డారు. బీసీని సీఎంగా ప్రకటించి చంద్రబాబు తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని కృష్ణయ్య కితాబిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని వర్గాలకు రాజ్యాధికారం దక్కాలని అభిలషించారు.