: పోలీసుల తనిఖీల్లో రూ.65 కోట్లు పట్టివేత: భన్వర్ లాల్


సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వాహన తనిఖీల్లో ఇప్పటివరకు రూ. 65 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ చెప్పారు. ఈరోజు (మంగళవారం) ఆయన వరంగల్ జిల్లా కలెక్టరేట్ లో ఈవీఎంలు భద్రపరిచే కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రానికి 352 కంపెనీల బలగాలు వచ్చాయని, ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. ఈ నెల 27న కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు భన్వర్ లాల్ చెప్పారు.

  • Loading...

More Telugu News