: గ్యాస్ ధర పెంపు విషయంలో కేజ్రీవాల్ కోరిక మన్నించిన ఈసీ
గ్యాస్ ధర పెంపునకు కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) బ్రేకులు వేసింది. ఈ దిశగా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థనను ఎన్నికల సంఘం మన్నించింది. ఈ అంశం అత్యున్నత న్యాయస్థానంలో విచారణలో ఉన్నందున రెండు నెలలు ఆగాలని ఈసీ ప్రభుత్వానికి సూచించింది. సుప్రీం విచారణలో ఉన్న అంశాలపై నిర్ణయం తీసుకుంటే కోర్టు ధిక్కారమవుతుందని ఈసీ అభిప్రాయపడింది.
ఎన్నికల సమయంలో గ్యాస్ ధర పెంపు తగదని కేజ్రీవాల్ అన్నారు. గ్యాస్ ధర పెంపును నిలిపివేయాలని ఆయన ఈసీని కోరారు. రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ కోసమే గ్యాస్ ధరలు పెంచుతున్నారని ఆయన ఆరోపించారు.