: సీమాంధ్రులు మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు: బీజేపీ


ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్ర ప్రజలు నరేంద్ర మోడీ ప్రధాని పీఠం ఎక్కాలని అభిలషిస్తున్నారని సీమాంధ్ర బీజేపీ అధ్యక్షుడు హరిబాబు అన్నారు. పారదర్శక, అవినీతి రహిత పాలన మోడీతోనే సాధ్యమని వారు నమ్ముతున్నారని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే సీమాంధ్ర అభివృద్ధికి సాధ్యమైనమేర సాయపడతామని హామీ ఇచ్చారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, విభజన అనంతరం సీమాంధ్ర ప్రజలు గుజరాత్ తరహా అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు. అంతేగాకుండా, అధికార వికేంద్రీకరణ చేస్తామని చెప్పారు. కాగా, హరిబాబు సమక్షంలో నేడు పలువురు చార్టర్డ్ అకౌంటెంట్లు, డాక్టర్లు, లాయర్లు బీజేపీలో చేరారు.

  • Loading...

More Telugu News