: శ్రీవారి పరకామణిలో చోరీ చేసిన అటెండర్
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి హుండీ కానుకలను లెక్కించే విభాగమైన పరకామణిలో ఓ ఇంటి దొంగ పట్టుబడ్డాడు. పరకామణిలో విధులు ముగించుకుని వెళ్తున్న శ్రీనివాస్ అనే అటెండర్ ను విజిలెన్స్ అధికారులు తనిఖీ చేయగా రెండు బంగారు చైన్లు బయటపడ్డాయి. దీంతో అతడిని వెంటనే అదుపులోకి తీసుకుని తిరుమల క్రైం పోలీసులకు అప్పగించారు. పరకామణిలో కానుకలు లెక్కించడానికి వరుసక్రమంలో ఆలయ సిబ్బందిని నియమిస్తూ ఉంటారు. ఈ క్రమంలో శ్రీనివాస్ వంతు ఈ రోజు వచ్చింది.