: టీడీపీ లక్ష్యం సామాజిక తెలంగాణ: ఎర్రబెల్లి
టీడీపీ లక్ష్యం సామాజిక తెలంగాణ అని ఆ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, టీడీపీ ఇచ్చిన మాటకు కట్టబడి ఉంటుందని తెలిపారు. తెలంగాణ ప్రజలు అధికారాన్ని కట్టబెడితే ముఖ్యమంత్రి బీసీయేనని ఆయన అన్నారు. వెనుకబడిన వర్గాలకు అధికారం కట్టబెట్టిన ఘనత టీడీపీదేనని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడు అని చెప్పిన కేసీఆర్ ఇప్పడు ఆ విషయాన్ని ప్రస్తావించడం లేదని అన్నారు. టీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని, టీఆర్ఎస్ లో మొత్తం కేసీఆర్ కుటుంబ సభ్యులే ఉన్నారని ఆయన విమర్శించారు.