: బాలీవుడ్ లో తెరకెక్కుతున్న మహాభారతం
భారతీయ ఇతిహాసం మహాభారతం త్వరలో ఓ చిత్రంగా తెరకెక్కబోతోంది. దర్శకుడు అభిషేక్ కపూర్ ఈ సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, మహాభారతం విశ్వవ్యాప్తమైన సత్యాన్ని వెల్లడించిందన్నారు. ఆథ్యాత్మికతపై తనకున్న అవగాహనను, మానవజాతిని ఇది నిర్వచించిందని పేర్కొన్నారు. అందుకే ఈ పురాణ గాథను వెండి తెరపైకి తీసుకురావాలని తాను లక్ష్యంగా పెట్టుకున్నట్లు అభిషేక్ వెల్లడించాడు. భారతీయ సినిమాలో ముందెన్నడూ లేని విధంగా ఒక అద్భుతమైన కథతో మ్యాజిక్ సృష్టించనున్నట్లు డిస్నీ ఇండియా నిర్మాణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం అభిషేక్ కపూర్ చేస్తున్న ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత జులైలో చిత్రీకరణ మొదలవుతుంది.