: సకల జనుల సమ్మె సమయంలో పొన్నాల ఎక్కడున్నారు?: స్వామిగౌడ్
కుటుంబ పాలన అంటూ టీఆర్ఎస్ ను, కేసీఆర్ ను విమర్శించడం సరికాదని టీఆర్ఎస్ నేత స్వామిగౌడ్ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలకు హితవు పలికారు. రాజకీయాల్లోకి వారసులు రావడం సహజమేనని చెప్పారు. సకల జనుల సమ్మె రోజుల్లో పొన్నాల ఎక్కడున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం వల్లే తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మంత్రి పదవులు వచ్చాయని అన్నారు. వందలాది మంది అమరులైనప్పుడు పొన్నాల కనీసం ఒక్క కన్నీటి చుక్క అయినా కార్చారా అంటూ నిలదీశారు.