: బీజేపీ లోక్ సభ ఎన్నికల ప్రచార గీతం విడుదల
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రచార గీతాన్ని విడుదల చేసింది. ఢిల్లీలోని ఆ పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఈ గీతాన్ని విడుదల చేశారు. 'మే దేశ్ నహీ మిత్నే దూంగా' తో మొదలయ్యే ఈ పాటను గాయకుడు సుఖ్విందర్ సింగ్ పాడాడు. ఇందులో కొంత భాగాన్ని మోడీ పాడటంతో ఆయన గొంతు కూడా వినిపిస్తుంది.