: దళిత ముఖ్యమంత్రి గురించి మీరా మాట్లాడేది?: పొన్నాలపై మందా విసుర్లు
టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై టీఆర్ఎస్ ఎదురుదాడిని పెంచింది. దళితుడైన అలంపూర్ ఎమ్మెల్యేకు టికెట్ కూడా కేటాయించలేని మీరు... దళిత ముఖ్యమంత్రి గురించి మాట్లాడతారా? అంటూ టీఆర్ఎస్ నేత మందా జగన్నాథం నిలదీశారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేయనని కేసీఆర్ ఎప్పడైనా అన్నారా? అని ప్రశ్నించారు. దళితుడే సీఎం అని జైరాం రమేష్ అంటే... మరో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ అదేమీ లేదని అన్నారని చెప్పారు. తెలంగాణ కోసం ఎంతో మంది విద్యార్థులు ప్రాణ త్యాగం చేస్తే... వారికోసం పీసీసీ కాని, ఏఐసీసీ కాని సంతాప తీర్మానం కూడా చేయలేదని విమర్శించారు.