: మావోయిస్టుల కంటే మస్కిటోలే ప్రమాదకరమట!


జార్ఖండ్ లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువన్న సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సిబ్బంది మావోయిస్టుల కంటే కూడా దోమలకు ఎక్కువ భయపడుతున్నారట. అడవుల్లో అన్నల కోసం కూంబింగ్ చేసే పోలీసులు ప్రత్యర్థుల బుల్లెట్ల నుంచి తప్పించకున్నా... దోమల కాటు నుంచి తప్పించుకోలేక కొన్ని సందర్భాల్లో ప్రాణాలు విడవడం ఎన్నికల అధికారులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

2011లో రవీంద్ర కర్మాలి అనే సబ్ ఇన్ స్పెక్టర్ మలేరియాతో మరణించాడు. 100 మంది జవాన్లు మలేరియా లక్షణాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫాగింగ్ యంత్రాలను జిల్లా హెడ్ క్వార్టర్లకు తరలించింది. అంతేగాకుండా మస్కిటో కాయిల్స్ ను పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బందికి అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

  • Loading...

More Telugu News