: మమత సర్కారుపై రాహుల్ దాడి
పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ సర్కారుపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వాగ్బాణాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి ఎన్నో నిధులు పంపిస్తోందని, అయితే అవి ప్రజలకు చేరడంలేదని రాహుల్ ఆరోపించారు. పశ్చిమబెంగాల్లోని జల్పాయ్ గురి జిల్లాలో జరిగిన ఓ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో సీఎం మమతా బెనర్జీ విఫలమయ్యారని విమర్శించారు. ప్రధానంగా, రాష్ట్రంలోని రోడ్లు దారుణంగా ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. సభా వేదిక వద్దకు చేరుకునే క్రమంలో రెండు నిమిషాల ప్రయాణానికి 15-20 నిమిషాలు పట్టిందని వివరించారు.