: కోహ్లీపై కపిల్ ప్రశంసల జల్లు


టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (55) ప్రశంసల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో మరే భారత క్రికెటర్ కు సాధ్యంకాని రీతిలో విరాట్ ఎన్నో రికార్డులు నెలకొల్పుతాడని విశ్వాసం వ్యక్తం చేశారు. కెరీర్లో మున్ముందు ఈ ఢిల్లీ క్రికెటర్ గాయాల పాలవకుండా ఉంటే సచిన్ ను సైతం అధిగమిస్తాడని పేర్కొన్నారు. మలేసియాలో జరిగిన ఓ క్రీడాకార్యక్రమంలో పాల్గొన్న కపిల్ అక్కడ మాట్లాడుతూ, 'రెండో బ్రాడ్ మన్ అనీ, మరో సచిన్ అనీ పోల్చలేం గానీ... 24 ఏళ్ళకే కోహ్లీ అపారప్రతిభ సముపార్జించాడు. సమీప భవిష్యత్తులో సచిన్ రికార్డులు తిరగరాయొచ్చు' అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News