: తిరుమల అడవుల్లో కార్చిచ్చు ఆరిపోయింది..!
తిరుమల శేషాచలం అడవుల్లోని కార్చిచ్చు ఎట్టకేలకు ఆరిపోయింది. సోమవారం మధ్యాహ్నం తలకోన నుంచి చెలరేగిన మంటలు కుమారధార, పసుపుధార వరకు వ్యాపించి ఆగిపోయాయి. ప్రస్తుతం శేషాచలం అడవుల్లో మంటలు ఎక్కడా కనిపించడం లేదు. మంటలు చల్లారడంతో టీటీడీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.