: జగనన్నకి ఓటేస్తే కార్డులన్నీ మీ ముంగిటకే: షర్మిల
జగనన్నకి ఓటేస్తే కావాల్సిన అన్ని రకాల కార్డులూ మీ ఊళ్లోనే అందుతాయని వైఎస్సార్సీపీ నాయకురాలు షర్మిల అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో షర్మిల వైఎస్ఆర్ జనపథంలో పాల్గొని ప్రసంగించారు. అసలు టీడీపీ అధినేత చంద్రబాబుకు మాట మీద నిలబడటం తెలుసా అని ఆమె ప్రశ్నించారు. రైతులు, మహిళలను హింసించిన పాపం బాబుదేనని ఆమె అన్నారు.
రాజశేఖర రెడ్డి హయాంలో అమలైన ప్రజాసంక్షేమ పథకాలు మళ్లీ జగనన్న ప్రభుత్వంలోనే అమలు అవుతాయని షర్మిల హామీ ఇచ్చారు. రైతులకు, మహిళలకు వడ్డీ లేని రుణాలు అందుతాయని అన్నారు. ఈసారి ఎన్నికల్లో ఓటు వేసే ముందు మహా నేత వైఎస్ ను గుర్తుకు తెచ్చుకోవాలని షర్మిల కోరారు.