: టీమిండియా పేసర్ కు అక్తర్ చిట్కాలు
భారత జట్టులో ప్రధాన పేసర్ గా ఎదుగుతున్న మహ్మద్ షమీ పాకిస్తాన్ మాజీ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ నుంచి కొన్ని చిట్కాలు అందుకున్నాడు. షమీ రనప్ మెరుగుపర్చుకుంటే మరింత మెరుగైన బౌలర్ గా తయారవ్వొచ్చని అక్తర్ సూచించాడు. అక్తర్ మిర్పూర్ లో మీడియాతో మాట్లాడుతూ 'ప్రస్తుత భారత జట్టులో షమీ ఉత్తమ పేసర్ గా కనిపిస్తున్నాడు. అతనిలో ఎంతో సహజ నైపుణ్యం ఉంది. అయితే, షమీలో ఓ లోపం కనిపిస్తోంది. అతని రనప్ లయబద్ధంగా లేదు. ఆ లోపాన్ని సవరించుకుంటే రానున్న రోజుల్లో మరింత నాణ్యమైన బౌలర్ గా ఎదుగుతాడు' అని తెలిపాడు.