: ఒత్తిడిలో ఉన్నారా? ఈ స్ప్రేను ముక్కులో కొట్టుకోండి


ఒత్తిడితో సతమతమయ్యే వారికి పరిష్కారంగా త్వరలో ఒక నాసల్ స్ప్రే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి స్ప్రేను టొరొంటోలోని సెంటర్ ఫర్ అడిక్షన్ అండ్ మెంటల్ హెల్త్ కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఈ స్ప్రేను ముక్కులో కొట్టుకుంటే దాని ద్వారా ఒక పెప్టయిడ్ మెదడు కుడి భాగానికి చేరుకుని డిప్రెషన్ పై ప్రభావం చూపుతుందని పరిశోధనకు నాయకత్వం వహించిన డాక్టర్ ఫంగ్ ల్యూ తెలిపారు. జంతువులపై పరీక్షించి చూసినప్పుడు మంచి ఫలితాలు కనిపించాయని చెప్పారు. ఈ పెప్టయిడ్ ను వినియోగించే విషయంలో సురక్షిత విధానాన్ని తాము కనుక్కోవాల్సి ఉందన్నారు.

  • Loading...

More Telugu News