: ఆ ఫొటోల విలువ అక్షరాలా రూ. 24 లక్షలట.. !


మామూలుగా అయితే ఓ ఫొటో ఎంత ధర పలుకుతుంది? పాస్ పోర్టు ఫొటోలు అయితే యాభై రూపాయలకు పదో పదహారో వస్తాయి, అదే కార్డు సైజ్ అయితే వంద రూపాయలకు రెండు వస్తాయనుకుందాం. కానీ, ఈ ఫొటోలు మాత్రం లక్షల్లో ధర పలికి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఇంతకీ ఆ ఫొటోలు ఎవరివనుకుంటున్నారా.. !? అక్కడికే వస్తున్నాం.

1960-70 దశకాల్లో ప్రపంచాన్ని తమ రాక్ సంగీతంతో ఊపేసిన ఇంగ్లీష్ మ్యూజిక్ బ్యాండ్ 'ద బీటిల్స్' పేరు తెలియని వారెవ్వరు. జాన్ లెనన్, సర్ పాల్ మెకార్ట్నీ, జార్జ్ హారిసన్, రింగో స్టార్ లు ఓ బృందంగా ఏర్పడి తమ గీతాలతో అభిమానులను ఉర్రూతలూగించారు. వీరి ఆల్బమ్ లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యేవి.

అయితే, 1965లో న్యూయార్క్ లోని షియా స్టేడియంలో వీరు అతి భారీ కచేరీ నిర్వహించారు. ఆ కచేరీకి మార్క్ వీన్ స్టీన్ అనే అమెచ్యూర్ ఫొటోగ్రాఫర్ నకిలీ పాస్ తో హాజరవడమే కాకుండా మొత్తం 61 ఫొటోలు తీశాడట. ఆ ఫొటోలే ఇన్నాళ్ళకు వెలుగులోకి వచ్చాయి. వాటిని వేలం వేయగా, దక్షిణ అమెరికాకు చెందిన బీటిల్స్ అభిమాని ఒకరు రూ. 24 లక్షలు చెల్లించి వాటిని ఎగరేసుకెళ్ళాడట. 

  • Loading...

More Telugu News