: రబ్రీదేవిపై పోటీ చేస్తున్న లాలూ బావమరిది
సార్వత్రిక ఎన్నికల్లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు సొంత వారినుంచే తీవ్ర పోటీ ఎదురు కానుంది. ఈ మేరకు పాట్నాలోని శరణ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి లాలూ భార్య రబ్రీదేవి పోటీ చేస్తున్నారు. ఇదే స్థానం నుంచి ఆయన (లాలూ) బావమరిది సాధు యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు. 2009 ఎన్నికల్లో ఆర్జేడీ నుంచి టికెట్ ఆశించిన సాధుకు లాలూ నిరాకరించారు. ఆ కోపాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు సవాల్ విసురుతున్నారు.