: కేసీఆర్ లేడు..గీసీఆర్ లేడు: కిషన్ రెడ్డి టిట్ ఫర్ టాట్


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మోడీలేడు గీడీలేడు అంటున్న కేసీఆర్ కు... కేసీఆర్ లేడు, గీసీఆర్ లేడు అని తానంటే ఎలా ఉంటుందని అన్నారు. ప్రాంతీయ పార్టీలకు ఓటేస్తే కుటుంబ పాలనకు ఓటేసినట్టేనని, నరేంద్ర మోడీకి ఓటేస్తే దేశానికి ఓటేసినట్టేనని తెలిపారు. నరేంద్ర మోడీకి ఓటేయొద్దని చెప్పే టీఆర్ఎస్ కు పార్లమెంటులో ఉన్నవి రెండు సీట్లేనని అన్నారు. పార్లమెంటులో తెలంగాణ గురించి ఒక్క మాట మాట్లాడని కేసీఆర్, ఒక్క రోజు కూడా ఎంపీగా నియోజకవర్గంలో పర్యటించలేదని కిషన్ రెడ్డి విమర్శించారు.

  • Loading...

More Telugu News