: హైదరాబాదు ఎయిర్ పోర్టులో అరకిలో బంగారం పట్టివేత
శంషాబాదు విమానాశ్రయంలో ఈరోజు అరకిలో బంగారం పట్టుబడింది. సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి ఈ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నైకు చెందిన సయ్యద్ రియాజ్ ఖాన్ అనే ప్రయాణికుడు సింగపూర్ నుంచి విమానంలో హైదరాబాదులోని శంషాబాదు ఎయిర్ పోర్టులో దిగాడు. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో అతడి లగేజిలో అరకిలో బంగారాన్ని గుర్తించారు. ఆ బంగారాన్ని సీజ్ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.