: జైపూర్ లో పేలుళ్లకు కుట్ర.. మరొక ఉగ్రవాది అరెస్ట్


ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) సంస్థకు చెందిన మరో అనుమానిత ఉగ్రవాది బర్కత్ ను జోథ్ పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. శని, ఆదివారాల్లో రాజస్థాన్ లోని అజ్మీర్, జోథ్ పూర్, జైపూర్ లో మొత్తం ఐదుగురు ఐఎం ఉగ్రవాదులను పోలీసులు పట్టుకున్నారు. వీరిలో నలుగురు ఉగ్రవాదులు కాగా, వారి అనుచరుడు మరొకడు ఉన్నాడు. అదే సమయంలో మరో అనుచరుడు బర్కత్ పారిపోయాడు. ఇతడి కోసం ప్రత్యేకంగా పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ఉదయం బర్కత్ తన ఇంటికి వస్తున్నాడన్న సమాచారంతో కాపు కాసి అతడిని అరెస్ట్ చేశారు. వీరు జైపూర్ లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు జోథ్ పూర్ పోలీసుల విచారణలో వెల్లడైంది. కీలక ఉగ్రవాది వకాస్ జోథ్ పూర్ కు వస్తూ అజ్మీర్ లో దొరికిపోయిన విషయం తెలిసిందే. నిజానికి ఇతడు జోథ్ పూర్ కు చేరుకుని స్థానికంగా ఉన్న ఉగ్రవాదులతో కలసి దాడి ప్రణాళికకు ఫైనల్ టచ్ ఇవ్వాల్సి ఉందని తేలిసింది.

  • Loading...

More Telugu News